మంత్రి అంబటి రాంబాబుకు.. ఆయన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో బిగ్ షాక్ తగిలింది. రాంబాబుకు టికెట్ ఇవ్వకూడదని నరసరావుపేట పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్కు అసమ్మతి నేతలు విజ్ఞప్తి చేశారు. "రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాకుండా చూడండి. కాదని ఆయనకే ఇస్తే 25 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయం." అని తేల్చిచెప్పారు. సత్తెనపల్లిలో వైసీపీ పరిస్థితిని అనిల్ కుమార్కు వివరించారు.