శింగనమల మండలంలో తరిమెల పీహెచ్ పరిధిలోని శింగనమల, బండమీదపల్లి, సోదనపల్లి, నిదనవాడ గ్రామాలలో వైద్య సిబ్బంది సోమవారం ఇంటి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే, లార్వా సర్వే చేసి చికిత్స చేయడం జరిగింది. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ గురించి గ్రామాలలో ప్రజలకు అవగాహనా కల్పించారు. జ్వరాల నివారణకై తీసుకోవలసిన జాగ్రతల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.