భారత ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల అధికారుల నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్,
ఎలక్షన్ కమిషనర్స్ నియామక నిబంధనల చట్టం 2023లోని సెక్షన్ 7, 8 ప్రకారం నియామకాలు చేపట్టకుండా కేంద్రాన్ని నిరోధించాలని కోరూతూ పిటిషన్ దాఖలైంది. ఒకవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇప్పటికే సర్వత్రా చర్చ మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.