పాకిస్థాన్ సూపర్-8 దశకు అర్హత సాధించినప్పటికీ, ఆ జట్టు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంకు తీవ్ర నిరాశ ఎదురైంది. నమీబియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో ఉన్నా, అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా టీమ్ మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. ఈ ఘటన ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో నాలుగో స్థానంలో బాబర్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. కానీ, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అతడికి బదులుగా యువ ఆటగాడు ఖవాజా నాఫేను క్రీజులోకి పంపాడు. నాఫే (5) త్వరగానే ఔటైనప్పటికీ, ఆ తర్వాత కూడా బాబర్‌ను కాదని షాదాబ్ ఖాన్‌ను బ్యాటింగ్‌కు ప్రమోట్ చేశాడు. దీంతో ఇన్నింగ్స్ ముగిసేంతవరకు బాబర్ డగౌట్‌కే పరిమితమయ్యాడు.గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న బాబర్‌పై యాజమాన్యానికి నమ్మకం సన్నగిల్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa