కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తేదీన వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్సీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ..‘ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను. సీఎం వైయస్ జగన్ పిలుపు మేరకు వైయస్ఆర్సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైయస్ జగన్ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం వైయస్ జగన్తో చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు.. చేయను. ఈనెల 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లికి బయలుదేరుతున్నాను. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలపంచుకొని తాడేపల్లికి రావాలని కోరుతూ ముద్రగడ లేఖను విడుదల చేశారు.