ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. వైయస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనలో భాగంగా తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం.. కొద్దిసేపటి క్రితమే కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక వైయస్ఆర్ సీపీ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో సీఎం పులివెందుల చేరుకుంటారు. కాసేపట్లో సొంత నియోజకవర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. పులివెందుల పర్యటనలో భాగంగా.. తొలుత డాక్టర్ వైయస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌ను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైయస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు చేరుకుని దానిని ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్ వైయస్ఆర్ జంక్షన్ ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైయస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. పులివెందులలో గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైయస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్-1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైయస్ఆర్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైయస్ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa