జగనన్న అంటే.. ఒక నమ్మకం.. ఒక భరోసా. పేదలకు అండగా ఉంటూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేయూతనందిస్తున్నారు. దాదాపు 36 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో నేరుగా రూ.2.50 లక్షల కోట్లకు పైగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశారు. పిల్లల చదువులు మొదలుకొని మహిళలు సాధికారతతో ఎదిగేలా తోడుగా నిలుస్తున్నారు. పేదలకు ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యం. వీటిని భరోసాగా వారికి అందించిన ఘనత సీఎం జగన్‌దే అని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ తెలిపారు.