బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని ముందుకు సాగటానికి సీఎం జగన్ కల్పిస్తున్న భరోసానే కారణం. ప్రతి కార్యకర్త, నాయకుడు 45 రోజులు పాటు కష్టపడితే ఆ తరువాత ఐదేళ్లు సీఎం జగన్ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. 2024 తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ మాత్రమే ఉంటుంది. జగనన్నను ఎదుర్కొనే దమ్ములేక ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ వెళ్లి కాళ్లా వేళ్లా పడుతున్నారు అని నరసరావుపేట వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు.