సీఎం జగన్‌కు పాలన చేతకాదని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు నాలుక మడత పెట్టి ఆయన ఒక బటన్ నొక్కితే నేను ఐదు బటన్లు నొక్కుతానని నమ్మబలుకుతున్నారు. కరోనా సమయంలో బడికి వెళ్లని పిల్లలకు ఎవరి అబ్బ సొమ్ములా అమ్మ ఒడి ఇచ్చారని విమర్శించిన చంద్రబాబు తాను ఒక్కరికైతే రూ.15 వేలు, ముగ్గురు పిల్లలుంటే రూ.90 వేలు చొప్పున ఇస్తామంటున్నారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలనూ రుణమాఫీ పేరుతో వంచించిన చరిత్ర చంద్రబాబుదే. సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మాటకు మించి పెట్టుబడి సాయాన్ని అన్నదాతలకు అందచేశారు. మాట ప్రకారం పొదుపు సంఘాల మహిళలను కూడా ఆదుకున్నారు అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.