ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు సీఎం జగనైతే 14 ఏళ్లు అందరినీ వంచించిన మోసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలో.. మోసగాడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. సీఎం జగన్‌ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనంటున్న చంద్రబాబు తనకు దత్తపుత్రుడు తోడైనా ధైర్యం చాలక ఇప్పుడు ముగ్గురం కలిసే వస్తామంటున్నారు. ఆయన సింగిల్‌గా వస్తే చితకబాదుతాం. ఇద్దరొస్తే విసిరి కొడతాం. ముగ్గురూ కలిసి వస్తే సముద్రంలో కలిపేస్తాం. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని 50 శాతానికిపైగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఆయన్ను ఏమీ చేయలేరు. టీడీపీ – జనసేన జెండాలు ఎత్తేసే సభలు నిర్వహిస్తున్నాయి అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa