సీఎం జగన్ నిరుపేద బిడ్డలకు ఇంగ్లిషు మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నారు. చేయూతతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నిజమైన సాధికారత అంటే కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే. మహిళల రక్షణ కోసం ‘దిశ’ తీసుకొచ్చారు. 1.40 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ రిజిస్టర్ కావడం సీఎం జగన్ కల్పిస్తున్న భరోసాకు నిదర్శనం అని హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.