సీఎం జగన్ అన్నదాతల శ్రేయస్సును కాంక్షిస్తూ రైతు రాజ్యం తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందచేశారు. ప్రతి కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు పెద్ద పీట వేసి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఉద్యోగాలు, పదవులు, రుణాలు, ఇళ్ల స్థలాలు... అన్నింటా వారికే ప్రాధాన్యం ఇచ్చారు. పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు చేరువ చేసి విద్యా దీపాలు వెలిగించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తేదీనే టంచన్‌గా రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లను ఇంటివద్దే పారదర్శకంగా అందించే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. లక్షల సంఖ్యలో సచివాలయ ఉద్యోగాలతోపాటు గ్రూపు 1, గ్రూపు 2, డీఎస్సీతో యువత కలలను నెరవేరుస్తున్నారు. సీఎం జగన్‌ను ప్రతి పేద కుటుంబం తమ పెద్ద బిడ్డ మాదిరిగానే భావిస్తూ ఆశీర్వదిస్తోంది అని ఒంగోలు వైసీపీ పార్లమెంటు సమన్వయకర్త, రీజినల్ కో–ఆర్డినేటర్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.