ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ అనే నేను సిద్ధం అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు. అధికారం పోతుందనే భయం లేదు. చెసేదే చెప్తాం. చెప్పామంటే చేస్తానని పేర్కొన్నారు. హిస్టరీ బుక్‌లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే కోరిక అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. 2024 తర్వాత కూడా మనం చేస్తున్న మంచి కొనసాగాలి. దేవుడి మీద తప్ప మీ అన్న పొత్తులు జిత్తులు నమ్ముకోలేదు. 2019కి ముందు మీకు మంచి భవిష్యత్తు అందిస్తానని మాటిచ్చా. 99 శాతం హామీలు అమలు చేశాం. మన సంకక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. తనపై అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకోవడమే. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ సీట్లకు 25 సీట్లు తెచ్చుకోవడమే మన టార్గెట్. మన నేతలు ఇంటి ఇంటికి వెళ్లి జరిగిన మంచి చెబుతున్నారు. వాళ్లు మాత్రం రామోజీ, రాధాకృష్ణ, ఢిల్లీ గడపలు తొక్కుతున్నారు. పేదవారి భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్‌నే తెచ్చుకోవాలని మీరంతా చెప్పండి. మీ అన్న వస్తేనే పథకాలన్నీ అందుతాయని చెప్పండి అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం సాయంత్రం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa