హమాస్‌తో పోరు విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుపట్టారు. ‘నేను మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని,
దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బైడెన్ భావిస్తే.. అది పూర్తిగా తప్పు’ అని వ్యాఖ్యానించారు. అలాగే గాజాలో తమ సైనికులు 13 వేలు మంది మిలిటెంట్లను హతమార్చారని ఆయన తెలిపారు.