ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడేది లేదని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు స్పష్టం చేశారు. సోమవారం నాడు నెల్లూరులో బొల్లినేని రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ముఖ్య నేతలతో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లినేని మీడియాతో మాట్లాడుతూ... తనను ఒక్క మాట కూడా సంప్రదించకుండానే ఉదయగిరి అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం బాధించిందని అన్నారు. చంద్రబాబు వల్లే గతంలో ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కొత్తగా వచ్చిన అభ్యర్థి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వాలని బొల్లినేని రామారావు కోరారు.