మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. దేవిరెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది. వీటితో పాటు దేవిరెడ్డి పాస్ పోర్ట్‌ను సరెండర్ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు(మంగళవారం) దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.