ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని వైయస్ఆర్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఉరవకొండ మండల కార్యాలయం ఆవరణలో వైయస్ఆర్ చేయూత సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేసి అండగా నిలిచారని వెల్లడించారు. మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేద మహిళకు సొంతింటి కలను నేరవేర్చాలన్న మంచి ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది లబ్దిదారులకు ఇంటిస్థలాలు కేటాయించడంతో పాటు వారికి ఇళ్లు కూడ మంజురు చేసినట్లు తెలిపారు. అతంటితో ఆగకుండా ఇంటి స్థలాలు అందుకున్న లబ్దిదారులకు ఓక్క రూపాయి కూడా ఖర్చులేకుండా ప్రభుత్వమే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు అందజేయడం చారిత్రాత్మకమన్నారు.