టీడీపీ ఉంగుటూరు అసెంబ్లీ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు కేటాయించాలని కోరుతూ నియోజకవర్గం నుంచి 700 కార్లలో 3,000 మంది కార్యకర్తలు, నాయకులు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయా నికి ఆదివారం తరలివెళ్లారు. గుండుగొలను జంక్షన్‌కు చేరు కున్న పార్టీ శ్రేణులు కార్లలో ర్యాలీగా రాష్ట్ర పార్టీ కార్యాల యానికి చేరుకున్నారు. ఉంగుటూరు సీటును గన్నికి కేటా యించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాల యంలో ఎన్టీఆర్ విగ్రహం పాదాల వద్ద వినతిపత్రాన్ని ఉంచి పార్టీ అధికార ప్రతినిధి పి.రమేష్‌కు అందజేశారు. అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యుడు షరీఫ్‌కు నియోజకవర్గ పరిస్థితిని వివరించారు.