రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని నడిపిస్తోందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడు, శాసనమండలిలో విప్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైయస్ఆర్సీపీ ఎదుర్కొందని తెలిపారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూ వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జతకట్టిన జెండాలన్నీ కనుమరుగవుతాయని అప్పిరెడ్డి జోస్యం చెప్పారు. 2019కి మించిన మెజారిటీతో వైయస్ఆర్సీపీ గెలుస్తుందన్నారు.