టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఈ సారి 23 సీట్లు కూడా రావు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ’జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ కావు. ఒకరిని ఒకరు తిట్టుకుని ఇప్పుడు మూడు పార్టీలు కలిశాయి.
రాష్ట్రం ఏం విధ్వంసమైందని మీరు కలిశారు? పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టినందుకా? ప్రజా సంక్షేమం అందిస్తున్నందుకా? రాష్ట్రంలో సామాజిక న్యాయం చేస్తున్నందుకా?' అని ఆయన మండిపడ్డారు.