ఎండాకాలంలో పుచ్చకాయ పండ్లు మార్కెట్ లోకి వస్తాయి. ఈ పుచ్చకాయల గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల వినియోగంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. పుచ్చకాయ గింజలను ఉడకబెట్టిన నీరు తాగడం వల్ల ఎముకలు, కణజాలాలు బలోపేతం అవుతాయని సూచిస్తున్నారు.