తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌లోని అర్రా సివిల్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 1న విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. దీంతో మత భావాలను దెబ్బతీశారనే కారణంతో సీనియర్ న్యాయవాది ధరణిధర్ పాండే కేసు దాఖలు చేశారు.