వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబానికి ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి,
ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు.