రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్‌కు టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హ్యాట్సాఫ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందన్నారు. నిన్నటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వని అధికారులు ఇప్పుడెందుకు బస్సులిస్తామని చెప్తున్నారని ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగే సభ గ్రాండ్ సక్సెస్ చేసేందుకే ఇప్పుడు లోకేష్‌తో సమావేశం అవుతున్నామని తెలిపారు. మూడు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. ఇంకా కొంతమంది పోలీసుల తీరు మార్చుకోవాలని సూచించారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే కచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గన్నవరం పోలీసుల వ్యవహారం చూస్తుంటే పోలీస్ స్టేషన్ ఎత్తివేస్తే చాలా మంచిది అనుకుంటున్నా అంటూ యార్లగడ్డ వ్యాఖ్యలు చేశారు.