రాష్ట్రంలో పండిన జొన్న పంటను మద్దతు ధరకు కొనాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మద్దతు ధర కంటే జొన్నల మార్కెట్ ధర తగ్గిపోయింది. దీంతో రైతులను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది .
హైబ్రిడ్ రకం జొన్నలు మద్దతు ధరకు కొనాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇక జొన్నలు క్వింటాల్ రూ.3,180 చొప్పున జగన్ సర్కార్ కొనుగోలు చేయనుంది.