ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు శివయ్య అధ్యక్షతన మంగళవారం హైదరాబాదులో వడ్డెర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో టీడీపీ మద్దతు తెలపాలని కోరారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని సీఎంగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేస్తారని తెలిపారు.