ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ ఈ ఏడాది చివరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఖరారైనట్లు అమెరికా మీడియా పేర్కొంది.
అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయడానికి 1,968 మంది ప్రతినిధుల ఓట్లు అవసరమవ్వగా తాజాగా జార్జియా రాష్ట్రంలో డెమొక్రాటిక్ పార్టీ ఫ్రైమరీ ఎన్నికల్లో బైడెన్ కీలక విజయం సాధించి.. నామినేషన్‌కు అర్హత సాధించారని వెల్లడించింది.