ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బొలెరో వాహన డ్రైవరు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బొలెరో వాహనం డ్రైవర్ ను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు నుంచి నంద్యాలకు బొలెరో వాహనం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa