మాల్దీవుల నుంచి భారత సైన్యం నిష్క్రమించింది. దక్షిణ అటాల్లో నిఘా విమానం విధులు నిర్వర్తిస్తున్న 25 మంది భారత సైనికులు ఆ దేశాన్ని వీడినట్లు మాల్దీవుల పత్రిక మిహారు ప్రకటించింది.
కాగా దీనిపై భారత్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనట్లు తెలుస్తోంది. కాగా మే 10 నాటికి భారత సైన్యం తమ దేశాన్ని వీడాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదేశించారు. దీంతో మొదటగా 25 మంది ఆ దేశాన్ని వీడినట్లు సమాచారం.