అయోధ్య బాల రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రామయ్య దర్శనానికి రోజూ సగటున 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు వస్తున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొంది.
బాలరాముడిని భక్తులు ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు దర్శనం చేసుకోవచ్చని, దర్శనానికి గంట సమయం పడుతుందని తెలిపింది. అలాగే భక్తులు మొబైల్ ఫోన్లు, పర్సులు మందిరంలోనికి తీసుకురావొద్దని, పూలు, దండలు, ప్రసాదం కూడా తేవొద్దదని సూచించింది.