తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. తిరుగుడు తలుపు వ్యవహారాలతో రాజకీయాలు కలుషితం అయ్యాయని, సర్పంచ్, ఎంపీటీసీ లు సర్వనాశనం అయిపోయారని అన్నారు. వికేంద్రీకరణకు అర్ధం లేకుండా పోయిందన్నారు. దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు పేరు ఆ కుటుంబ సభ్యులు నిలబెట్టాలన్నారు. కొండపల్లి శ్రీనివాసరావు విజయానికి అందరూ సహకరించాలని అశోక్ గజపతిరాజు పిలుపిచ్చారు.