ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం వైయస్ జగన్..మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం మొదలుపెడతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి అదేరోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో ఆయన ప్రచారంలో పాల్గొనచ్చని తెలుస్తోంది. ఇలా రోజుకు రెండు లేదంటే మూడు బహిరంగ సభలు, రోడ్ షోలో సీఎం వైయస్ జగన్ పాల్గొనేలా పార్టీ వర్గాలు ఒక షెడ్యూల్ను రూపకల్పన చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తోంది.