పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో మోసపోయిన టీడీపీ సీనియర్ నేత ఈలి నాని (ఈలి వెంకట మధుసూదనరావు) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ సీనియర్ నేత ఈలి నాని (ఈలి వెంకట మధుసూదనరావు) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈలి నాని, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి పాల్గొన్నారు.