ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపై బీజేపీ అధిష్టానానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆమె తీరుతో పార్టీ నష్టపోతుందని లేఖలో ప్రస్తావించారు. తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బలి చేస్తున్నారని ఆరోపించారు.
పొత్తులో భాగంగా అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే స్థానాలు తీసుకోవడంపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అరకు, పాడేరు స్థానాలపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.