దేశంలోని రైతులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెబుతోంది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. 2023లో అధిక ఉష్ణోగ్రతలు,
వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు మన దేశ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. ఎల్‌నినో తొలుత ఏప్రిల్-జూన్ మధ్య తటస్థ స్థితికి రావడానికి 83 శాతం, జూన్-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని తెలిపారు.