బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ చట్టం (CAA)పై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనుంది. CAA నిబంధనలపై స్టే విధించాలని వచ్చిన పిటిషన్లను మార్చి 19న విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
కాగా CAAలో సవరణలు మత ప్రాతిపాదికన జరిగాయని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. విదేశాలు సైతం దీనిని తప్పుబడుతున్నాయి.