మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. మధ్యాహ్నం 1:48 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి.
దీంతో ప్రజలు ఇళ్ల నుంచి వెంటనే బయటకు వచ్చారు. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.