ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన చోటుచేసుకుంది ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు స్వల్ప గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారందరూ సురక్షితంగా ఉన్నారని వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు తెలిపారు.