దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రాముఖ్యతను గురించి ప్రతి సంవత్సరం మార్చి 16వ తేదీన జాతీయ టీకా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్లను నిర్వహిస్తారు.
అంతేకాకుండా టీకాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలు, తీసుకోకపోతే జరిగే నష్టాలు గురించి అవగాహన కల్పిస్తారు. ఏయే వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఏ వయసులో వ్యాక్సిన్ తీసుకోవాలి వంటి వాటిపై కూడా నిపుణులు సూచిస్తున్నారు.