ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి రూ.15,000 బెయిల్ బాండ్, రూ.లక్ష పూచీకత్తుపై శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు ఈడీ ఫిర్యాదుల ఆధారంగా కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు.