ఈ నెల 18వ తేది నుంచి నిర్వహించు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలని శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం సిపిఐ కార్యాలయం నందు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏఐఎస్ఎఫ్ తాలూకా ఉపాధ్యక్షుడు నవీన్, ఇంద్ర, హర్షవర్ధన్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 142పరీక్ష కేంద్రాలలో 40, 063మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయుచున్నారు. వారికి సరైన వసతులు కూడా కల్పించలేదన్నారు.