ప్రసార భారతి చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. కొత్త చైర్మన్‌గా నవనీత్ కుమార్ సెహగల్‌ను ప్రతిపాదిస్తూ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సును రాష్ట్రపతి ఆమోదించారు.
ప్రసార భారతి చైర్మన్ పదవి నాలుగేళ్లుగా ఖాళీగా ఉంది. చివరిగా ఏ.సూర్యప్రకాశ్ ఈ పదవిలో ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో ఆయన రిటైర్ అయ్యారు.