రాష్ట్ర విభజన తరువాత ఇబ్బందుల పరిష్కారం, నిధుల విడుదల, రాజధాని, పోలవరం నిర్మాణం, ప్రత్యేక హో దా సాధన కోసం సీఎం జగన్ ఏనాడూ ప్రయత్నించలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించా రు. శనివారం ఉక్కు నగరంలోని తృష్ణా మైదానంలో నిర్వహించిన ‘న్యాయ సాధన సభ’లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘ఐదేళ్లుగా సీఎం హోదాలో ఢిల్లీకి వెళుతున్నారు. వస్తున్నారు...కానీ ఇక్కడ ప్రజల కోసం కేంద్ర పెద్దలను ఏమీ అడగలేదు. కేవలం తనపై ఉన్న కేసుల నుంచి బయటపడడం కోసం, సొంత చిన్నాన్నను చంపి న హంతకులను కాపాడేందుకు వెళుతున్నారు’’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa