రాజస్థాన్ అజ్మీర్‌లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి 1 గంటకు రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి-ఆగ్రా కాంట్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఓ గూడ్స్ రైలును ఢీకొనడంతో సూపర్‌ఫాస్ట్ రైలు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.