కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు (ఎర్రనేల) సరోజ కంపౌండ్ సమీపంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తలారి రంగయ్య కలసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ తలారి రంగయ్య నాలుగున్నరేళ్లుగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.