ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి కేంద్రం బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికెట్. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, వివాహ నమోదు తదితర ప్రయోజనాలకు ఇది తప్పనిసరి. పిల్లలు పుట్టిన ఏడు రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి.’ అని సీఎస్ అన్నారు.