మైలవరం స్థానానికి ఎంపిక చేసిన సర్నాల తిరుపతిరావు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. పదో తరగతి వరకు చదవుకున్నారు. తండ్రి సర్నాల చిన్న జమలయ్య సహకార బ్యాంకులో అటెండర్‌గా పని చేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో 2014 నుంచి 2019 వరకు వైయస్ఆర్సీపీ మైలవరం మండల సెక్రటరీగా పని చేశారు. 2021లో మైలవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.