అసలైన రుద్రాక్షను గుర్తించడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజమైన రుద్రాక్షకు సహజంగా రంధ్రాలు ఉంటే డూప్లికేట్ రుద్రాక్షల్లో విడిగా రంధ్రాలు చెక్కబడి కనిపిస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. రుద్రాక్షను ఆవనూనెలో ఉంచినపుడు దాని రంగును కోల్పోతే అది నకిలీ రుద్రాక్షగా గుర్తించవచ్చు. అలాగే రుద్రాక్ష నీటిలో మునిగితే అది నిజమైనదిగా గుర్తించాలి. డూప్లికేట్ రుద్రాక్ష నీటిలో తేలుతుందని నిపుణులు చెబుతున్నారు.