సామాన్యులు, పేదలు చట్ట సభల ప్రతినిధులైనప్పుడే వ్యవస్థకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నది ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ నమ్మకం. ఆ లక్ష్యంతోనే ఈ సారి సాధారణ ఎన్నికల్లో సామాన్యులకు టికెట్లు కేటాయించారు. ఈ అభ్యర్థులంతా నిన్న మొన్నటి వరకు నిత్యం ప్రజా సంబంధాల్లో, సేవలో నిమగ్నమైన వారే కావడం విశేషం. ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.కోట్లకొద్దీ డబ్బుండాలి. కానీ ఇక్కడ సీఎం వైయస్ జగన్ నోట్ల కట్టలు చూడలేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. అదే ప్రామాణికంగా సీట్లు కేటాయించారు. రూ.కోట్లు ఇస్తే కానీ సీటు ఇవ్వలేమని టీడీపీ తెగేసి చెబుతుంటే... వైయస్ జగన్ మాత్రం పేదలకే పెద్దపీట వేశారు. ఈసారి ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఇద్దరు నిరుపేదలకు టికెట్లిచ్చి రికార్డు సృష్టించారు.