చీరాల పట్టణ నడిబొడ్డున ఉండే రైల్వే ఓవర్ బ్రిడ్జి ముందు భాగం గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పర్చూరు వైపు నుండి వచ్చే వాహనదారులతో పాటు కారంచేడు గేటు ఆవల ఉండే మున్సిపల్ వార్డుల ప్రజలు ఈ ఆర్ఓబి మీదే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ ఆర్ఓబి మధ్యలో గుంతలు ఉండటంతో పాటు వాలుగా దిగే వద్ద రోడ్డు బాగా దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa